జయశంకర్ భూపాలపల్లి జిల్లా నరబలి కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట వర్షిణి హత్యను నరబలి అనుకున్నా, అసలు నిజం పూర్తిగా భిన్నంగా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. 22 ఏళ్ల యువతి వర్షిణి హత్య వెనుక ఉన్న అసలు కారణం ఆమె తల్లి కవిత వివాహేతర సంబంధమే అని దర్యాప్తులో తేలింది. కూతురు తన అనైతిక సంబంధానికి అడ్డుగా మారుతుందని భావించిన కవిత, సుపారీ ఇచ్చి వర్షిణిని హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. ఇక కవిత క్రూరత్వం ఇక్కడితో ఆగలేదని విచారణలో బయటపడింది. రెండు నెలల క్రితం పక్షవాతంతో బాధపడుతున్న తన భర్తను కూడా ప్రియుడి సహాయంతో హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది. ఈ సంఘటనలు వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తల్లితనాన్ని మరిచి భర్త, కూతురి ప్రాణాలు బలి చేసిన కవిత క్రూరత్వం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు కేసులో కీలక ఆధారాలను సేకరించి, కవితతో పాటు సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి, నరబలి అనుకున్న కేసు వెనుక ద్వంద్వహత్యల ఘోర నిజం వెలుగులోకి రావడంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Post A Comment: