హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత రేపు మీడియా ముందుకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. పార్టీ తనపై తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై కవిత ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అంతర్గత రాజకీయ తగాదాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో కవిత సస్పెన్షన్ నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారింది. ఆమె ప్రెస్‌మీట్‌లో తనపై జరిగిన చర్యల వెనుక కారణాలను బయటపెడతారా? లేక భవిష్యత్తు రాజకీయ ప్రణాళికపై స్పష్టత ఇస్తారా? అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాలపై కవిత వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు, రాజకీయ పరిశీలకులు ఆమె మాట్లాడబోయే మాటలపై కన్నేసి ఉన్నారు. బీఆర్ఎస్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు విసరనున్నారా? లేక తన భవిష్యత్తు దిశపై సంకేతాలు ఇస్తారా? అన్న దానిపై రేపటి ప్రెస్‌మీట్ కీలకంగా మారనుంది.
Post A Comment: