ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు .
సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి , గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. రెండు విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలు లోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి నిబంధనల ప్రకారం 24 గంటలు, 48 గంటలు, 72 గంటల లోపు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు.
బ్యాలెట్ బాక్స్, పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్స్, సరిపోయేంత మెటీరియల్ అన్నీ సరిగా చూసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జిల్లాలోని ఆరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో మిగతా 6 మండలాల్లో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఎన్నికల విధులకు సంబంధించి రెండు దఫాలుగా ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ,డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా పరిషత్ సీఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: