ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు .సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలుడల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తులు కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు తదుపరి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిషా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, మారిన అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా డౌట్స్ వస్తే చాలా సమస్యలు వస్తాయని, ముందు నుండే సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి పొరపాటుకు నిర్వహించొచ్చని వివరించారు. ఎన్నికలు ట్రాన్స్ఫరెన్సీ, సక్సెస్ ఫుల్ గా జరగాలని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సహకార అధికారి వాలియా నాయక్, ఆడిట్ అధికారి మానస, డిఆర్డిఓ బాలకృష్ణ, డిఈఓ రాజేందర్, సిపిఓ బాబురావు, మత్స్యశాఖ అధికారి విజయకుమార్, అన్ని మండలాల ఎంపీడీవోలు మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: