ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
జిల్లాలో జరుగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సమన్వయం, సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ సోమవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, వెబ్‌కాస్టింగ్ తదితర విభాగాల వారీగా సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

Post A Comment: