ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

రాష్ట్రంలో రెండు దఫాలుగా ఎంపిటిసి, జడ్పిటిసి, 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అనుసరిస్తూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్ లను తొలగించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ఎన్నికల నిర్వహించడానికి అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు నిర్వహణపై పిఓలు, ఏపిఓ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టి,విఎస్టీ, ఎంసిసి టీములను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంపిటిసి, జడ్పిటిసి, వార్డు సభ్యులు, సర్పంచి ఎన్నికలు నిర్వహణకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు.

బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మరమ్మత్తు చేయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.


మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండాలని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం, డబ్బు లేదా బహుమతుల తదితర కార్యక్రమాలు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం మరియు ఐటీ ఆధారిత పర్యవేక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాలలో బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనికీలు చేపట్టాలని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై నిఘా పెంచాలని పర్యవేక్షణకు, ఫ్లైయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి

 గురించి ఎంపిడిఓలకు, తహసీల్దార్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. నామినేషన్లు, కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపధ్యంలో తక్షణమే జిల్లాలో (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు పటిష్టంగా అమలుకు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని నియమావళి ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: