ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సాయంత్రం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వేడుకగా మహిళల ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో భాగంగా మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని, పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా జిల్లాలోని ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకు మరియు జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు అన్ని పండుగలను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహిస్తున్నామని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు మరియు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొంటూ, జిల్లాలోని ఉద్యోగులందరం జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారూ. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే పండుగ బతుకమ్మ అని పేర్కొంటూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తున్నదని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగినులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా అధికారులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు 

కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్య నాయక్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు బైరీ సోమయ్య,డాక్టర్ ప్రవీణ్,పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్,శ్యామ్ సుందర్,మాధవ రెడ్డి, వాసం శ్రీనివాస్,రాజ్యలక్మి,బోనాల మాధవి,మల్లారం అరుణ,పావని,జ్యోత్స్న,రజిత,సరస్వతి,శ్రీలత, రాజమణి, యమున,ఇందిరా ప్రియ దర్శిని,విజయ లక్ష్మీ, కత్తి రమేష్,రాము నాయక్, లక్ష్మి ప్రసాద్,రాజీవ్, అనూప్ ,ప్రణయ్,పృథ్వి, నిఖిల్ , అనిల్ రెడ్డి,రాజమణి,నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: