ఉమ్మడి వరంగల్ : మాడుగుల శ్రీనివాస శర్మ
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు మేరా యువ భారత్ వారి ఆధ్వర్యంలో యువ ఆపదమిత్ర కార్యక్రమంలో భాగంగా సామాజిక స్పృహ కల్గిన యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్, వరంగల్. చింతల అన్వేష్ తెలిపారు.
సమాజం వరదలు, కరువు, భూకంపాలు, కరోనా వంటి విపత్కర సమయంలో ఆపత్కాలంలో ఉన్నప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి భద్రతా దళాలకు అండగా ఉండటానికి యువతను సుశిక్షితులను చేసే అద్భుతమైన కార్యక్రమం ఇదని వెల్లడించారు.
వారం రోజుల పాటు హన్మకొండ, వరంగల్ లో జరిగే ఈ శిక్షణ శిభిరం అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ఆపత్కాలంలో ఉపయోగకరంగా ఉండే ఒక ఎమర్జెన్సీ కిట్ తో పాటు, శిక్షణ పొందినట్లు ప్రభుత్వ సర్టిఫికెట్ కూడా ఇస్తుంది.
దరఖాస్తు చేసుకోవాల్సిన వారి అర్హతలు:-
1. ప్రభుత్వం జారీచేసిన అడ్రెస్స్ ప్రూఫ్ లో వరంగల్ , హన్మకొండ జిల్లాలకు చెందిన వారై ఉండాలి.
2. వయస్సు 18 - 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
3. విద్యార్హత కనీసం 7 వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
4. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.
5. దరఖాస్తుకు ఈ నెల 6 చివరి తేది.
గ్రామాల్లోని యువత, విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు పెద్దఎత్తున నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పూర్తి వివరాల కోసం హన్మకొండ బస్ స్టాండ్ సమీపంలోని మై భారత్ కార్యాలయంలో ( నెహ్రూ యువకేంద్రం) సంప్రదించగలరు.
ఫోన్: 0870- 2958776

Post A Comment: