మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూర్ గ్రామంలో మురికి కాలువలు చెత్త చెదారం అస్తవ్యస్తంగా మారాయి ఎక్కడ చూసినా మురికి కాలువలలో చెత్త పిచ్చి మొక్కలు పెరిగి దుర్వాసన వెదజల్లుతున్నాయి వర్షం కురిస్తే రోడ్లపైకి మురికి నీరు వస్తుందని అదేవిధంగా మురికి కాలువలలో దోమలు పెరిగి ఇళ్లలోకి వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు గ్రామ సెక్రెటరీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న గాని చేస్తాను అనడమే తప్ప ఇప్పటివరకు చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించ లేదు అని గ్రామస్తులు తెలిపారు గ్రామాలలో సర్పంచులు లేక అంతా గ్రామ సెక్రెటరీలు చూసుకోవడం వల్ల మాకు అడిగే వారు ఎవరు అనే ఆలోచనలో ఉన్నారని వాపోయారు గ్రామ యువకులు ఎన్నిసార్లు అడిగినా కానీ సమాధానం చెప్పడమే తప్ప చేసి చూపెట్టిన దాఖలాలు ఇప్పటివరకు కనిపించడం లేదు అని తెలిపారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువలు చెత్త పిచ్చి మొక్కలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేనిపక్షంలో ఫోటోలతో సహా తీసుకొని మెదక్ జిల్లా కలెక్టర్ ను స్పందిస్తామని అన్నారు.
Post A Comment: