ఉమ్మడి వరంగల్ :మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా లో జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీపీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సమాచారం అందించాలని సూచించారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని సూచించారు.వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తగిన అన్ని ఏర్పాట్లు చేయాలి
జిల్లా నుంచి జీపీఓ పరీక్ష రాసి 107 మంది ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ స్నేహ శబరీష్ వెల్లడించారు. అభ్యర్థులను ఈ నెల 5 వ తేదీన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి తరలించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ను నోడల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు. హైదరాబాద్ తరలివెళ్లే అభ్యర్థులకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఏ.ఓ. గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: