ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
వినాయక నిమజ్జనం లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని కాటారం డిఎస్పీ సూర్య నారాయణ సూచించారు.
కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని పురస్కరించుకొని నిమజ్జనం ఏర్పాట్ల కొరకు సోమవారం మండల వివిధ శాఖల అధికారులతో కాటారం డిఎస్పి సూర్యనారాయణ కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి గణేష్ నిమజ్జనం కొరకు పెద్ద సంఖ్యలో గణేశులను తీసుకుని వచ్చి కాళేశ్వరం గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. కావున ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్ల చేయాలని వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో డిఎస్పి కోరారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సిఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై జి తమాషా రెడ్డి మరియు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: