ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
ఎన్పీడీసీఎల్ లో ఎస్ . సి , ఎస్ టి ఉద్యోగుల కు రూల్ ఆఫ్ రిజర్వేషన్ , రోస్టర్ పాయింట్స్ , బ్యాక్ లాగ్ వెకన్సీ సమస్యల పై చర్చించడానికి నేడు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య , మెంబర్లు కుర్సం నీలా దేవి, రాంబాబు నాయక్, జిల్ల శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ చాల విషయాలు ప్రశాంత వాతావరణంలో చర్చించడం జరిగిందని అన్నారు. అసోసియేషన్ నాయకులు తమ సమస్యలు నివేదించిన పుస్తకాన్ని నెల రోజులలో యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే పరిష్కారం కానీ సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు . అలాగే రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశంలో కూడా చర్చిండం జరుగుతుందని అన్నారు . కమిషన్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుంటుందని మీకోసం పనిచేస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఎటువంటి సమస్యలు ఉన్న హైదరాబాదులో ఉన్న కమిషన్ కార్యాలయానికి విచ్చేసి సమస్యలు తెలపాలని కోరారు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు ఎన్పీడీసీలో లైజనింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు . ప్రతి మూడు నెలలకు ఒకసారి పర్మనెంట్ నెగోషియన్ కమిటీ (PNC) సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు రోస్టర్ పాయింట్లను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
అంతకు ముందు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ హెచ్ ఆర్డీ సి. ప్రభాకర్ ఎన్పీడీసీఎల్ లో అవలంబిస్తున్న విధి విధానాలను కమిషన్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు . రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ ల ప్రకారం నియామకాలు , పదోన్నతులలో ఎస్సీ, ఎస్టీ లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ , రోస్టర్ పాయింట్స్ ను విపులంగా నివేదించారు . ఈ నివేదనలో విన్నవించారు .
తదనంతరం ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దానయ్య మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ లో న్యాయ పరంగా, రాజ్యాంగ బద్దంగా పరిష్కరించాల్సిన సమస్యలను కమిషన్ కు నివేదించారు .
అలాగే ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ ఫుల్ టైం ఆఫీస్ బేరర్ అనుమతి ఇవ్వాలని కోరారు . అలాగే నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబెర్ వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన సమస్యలు చాల ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కమిషన్ కు నివేదించారు .
అలాగే ఆనందం , రాందాస్ నాయక్ వారు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కుంటున్న సమస్యలను కమిషన్ కు నివేదించారు .
పై వాటికీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ హెచ్ ఆర్డీ సి. ప్రభాకర్ సమాధానమిస్తూ కమిషన్ సూచన మేరకు సమస్యల పరిష్కారం కొరకు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు .
ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీ , వి . మోహన్ రావు , వి . తిరుపతి రెడ్డి , సి . ప్రభాకర్ , సి.ఈ లు : కె . మాధవ రావు , జియం లు : గిరిధర్ , శ్రీ కృష్ణ , శ్రీనివాస రావు , జాయింట్ సెక్రటరీ : కె . రమేష్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: