ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ప్రజలు 179 వినతులను అందజేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరగా ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే ప్రజావాణి కార్యక్రమం నాటికి వినతులను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, పలు శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: