ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హన్మకొండ లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు & తెగలు కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అధ్యక్షతన ఎస్సీ,ఎస్టీ రూల్ అఫ్ రిజర్వేషన్, బ్యాక్ లాగ్ వేకెన్సీస్ మరియు రోష్టర్ పట్టిక పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా బ్యాంకు సమీక్ష సమావేశానికి విచ్చేసిన ఎస్సీ&ఎస్టీ కమిషన్ చైర్మన్ కి రవీందర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన అనంతరం బ్యాంక్ టర్నోవర్,బ్యాంకు అబివృద్ధి మరియు రిజర్వేషన్ నియమాకలపై ఖాళీల భర్తీపై మరియు పదోన్నతులపై వారికి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జన్ను మహేందర్ ఎల్ డి ఎం హనుమకొండ సీఈవో వజీర్ సుల్తాన్,ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నీలా దేవి,రాంబాబు నాయక్,లక్ష్మీనారాయణ,శంకర్,ప్రవీణ్, ఎల్ఎండీ జిఎం లు ఉషా శ్రీ, పద్మావతి, డిజిఎం లు అశోక్, ఏజీఏం లు రాజు,మధు,స్రవంతి, కృష్ణమోహన్,బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: