జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ప్రజలతో సమావేశమై, వారు వినిపించిన సమస్యలు, ఫిర్యాదులను శ్రద్ధగా ఆరా తీశారు.
ఎస్పీ ప్రజల అభ్యర్థనలు, ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పంపిస్తూ, త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా పరిగణించి, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదివస్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మరియు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: