ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 



ఉమ్మడి వరంగల్;

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  ఆసుపత్రులలో అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ 

స్నేహ శబరీష్ అన్నారు.సోమవారం

     హనుమకొండ జిల్లాలోని ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల , పట్టణ ఆరోగ్య కేంద్రాల ఫార్మసీ ఆఫీసర్స్ మరియు సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఫార్మసీ అధికారులతోల తో జిల్లా కలెక్టర్  సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య  జిల్లాలో ఉన్నటువంటి మందుల లభ్యతను ఈ ఔషధీ పోర్టల్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ గురించి తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ వైద్యాధికారులు ఫార్మసీ ఆఫీసర్స్ సమన్వయంతో పని చేయాలని, అందుబాటులో ఉన్న మందుల వివరాలు ప్రతిరోజు వైద్యాధికారికి తెలియజేయాలని ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సెంట్రల్ మెడికల్ స్టోర్ కు ఇండెంట్ చేయాలని, ఈ ఔషధీ  పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలని , గడువు తేదీని గమనిస్తూ వినియోగించాలని వ్యాక్సిన్ లను సరియైన రీతిలో భద్రపరచాలని ఆమె సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ పేషెంట్ రిజిస్టర్ను ఒకే పద్ధతిలో నిర్వహించేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి సూచించారు.రోగులకు మందులు ఏ విధంగా వాడాలనేది వివరించాలన్నారు.ఆన్లైన్లో నమోదు చేయడానికి ఇంటర్నెట్ వసతి కల్పించడానికి పరిశీలిస్తామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య మరి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య, సెంట్రల్ మెడికల్ స్స్టోర్ సీనియర్ ఫార్మసీ ఆఫీసర్  నలిని, ఫార్మసీ ఆఫీసర్ శ్రీ ఉప్పు భాస్కర్ రావు జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, జిల్లా ఫార్మసీ స్టోర్ ఇంచార్జ్ శ్రీ శరత్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  బత్తిని సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఫార్మసీ ఆఫీసర్స్  సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి అందజేయడం జరిగింది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: