కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం అనుబంధ ఆలయం అయిన సీతారామ ఆలయంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అధికారులు కళ్యాణ వేదికను వివిధ రకాల రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
భక్తులు సీతారాములను దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులు సీతారాములను దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Post A Comment: