కాటారం, మార్చి 25: వరి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రైతులకు బోనస్ డబ్బులు జమ చేయకపోవడం అన్యాయమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్ అన్నారు. కాటారంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే రైతులకు బోనస్ డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇచ్చిన హామీ మేరకు పూర్తి రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు సంబంధించిన విధివిధానాలను తక్షణమే ప్రకటించాలని కోరారు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: