కాకతీయ యూనివర్సిటీ (KU) డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించడానికి ఇవాళ (మార్చి 25, 2025) చివరి తేదీ అని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫీజు చెల్లించడంలో ఆలస్యం చేయవద్దని సూచించారు. అంతేకాకుండా, ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీ (APAR ID) మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను సంబంధిత కళాశాలలో సమర్పించి లింక్ చేసుకోవాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి, కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే ఫీజు చెల్లించి, అవసరమైన పత్రాలను కళాశాలలో అందజేయాలని కోరడమైనది.
Post A Comment: