ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లా లో మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపిక పై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలో రెండు వందల పదహారు మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్ కు తెలియజేశారు. జిల్లాలో మిషన్ వాత్సల్య  పథకానికి 7 కేటగిరీలలో  ఎంపికచేసామని,  ఎంపిక ప్రక్రియ గ్రామ స్థాయిలో అంగన్వాడీ  టీచర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ప్రాజెక్ట్ స్థాయిలో ఐసిడిఎస్ సిడిపివొ సూక్ష్మ పరిశీలన, సామాజిక దర్యాప్తు నివేదిక అనంతరం నివేదికను, సంబంధిత అర్హులను బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టి, జిల్లా స్థాయి స్పాన్సర్షిప్ కమిటీ ఆమోదించగా అర్హులను ఎంపిక చేశామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  మిషన్ వాత్సల్య  పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేయాలన్నారు. ఎంపిక చేసే జాబితాలో  తల్లితండ్రులు లేని బాలబాలికలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రి ఇరువురు వదిలేయగా సంరక్షకుల  వద్ద ఆశ్రయం పొందుతున్న వారికి,వితంతు మహిళలు, రక్షణ సంరక్షణ విద్యా వైద్య పోషకాహార అవసరతలు ఉన్న బాల బాలికలను గుర్తించి అర్హులుగా ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బాలల సంక్షేమ సమితి ఛైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, సీడీపీఓలు ఎం విశ్వజ, కె స్వాతి, స్వరూప,బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్. అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్చార్జి ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక, శిశు గృహ ఇన్చార్జి మేనేజర్ ఏ మాధవి, సోషల్ వర్కర్లు ఎం. శ్రీనివాసులు,జి సునీత,ఎస్ చైతన్య,ఓఆర్డబ్ల్యూ పి విజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: