తెలంగాణలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అయిదారుసార్లు నిబంధనలను అతిక్రమించే డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
అలాంటి వారి లైసెన్స్లను మళ్లీ పునరుద్ధరించరు.
అలాగే వాహనాలు రిజిస్ట్రేషన్ కూడా కావని మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారథి వాహన్ పోర్టల్ మీద రవాణ శాఖలో రెండు మూడు కొత్త సంస్కరణలను అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి ప్రకటించారు. సారథి వాహన్ పోర్టల్‌లో తెలంగాణ కూడా భాగస్వామి అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 28 విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి లైసెన్సులు 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Post A Comment: