హన్మకొండ ;

 హనుమకొండ భద్రకాళి చెరువు నీటిని సాఫీగా విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

 భద్రకాళి చెరువు పూడికతీత పనులకు ముందస్తు చర్యలలో భాగంగా శుక్రవారం నుండి చెరువు నీటి విడుదల నేపథ్యంలో గురువారం హనుమకొండ కాపువాడ సమీపంలో ఉన్న భద్రకాళి చెరువు మత్తడితో పాటు కాపువాడ వద్ద ఉన్న నీటి కాలువ, ఎస్టిపి కోసం రెడ్డి పురం జంక్షన్ ప్రాంతంలో గతంలో సాగునీటిపారుదల శాఖ కెనాల్ కోసం మట్టి తీసిన ప్రాంతాన్ని, హసన్ పర్తి మండలం నాగారం గ్రామంలోని పెద్ద చెరువును హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులతో కలిసి పరిశీలించారు. 

భద్రకాళి చెరువు నీరు విడుదలకు సంబంధించిన పలు అంశాలపై సాగునీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మీడియాతో మాట్లాడుతూ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతో నిండిపోయిందని, దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతూ వస్తుందని..ఇదే విషయం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రులు పాల్గొన్న సమావేశంలో వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. దీంతో భద్రకాళి చెరువు పూడికతీత పనులు, చెరువు చుట్టూ ఇతర అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. భద్రకాళి చెరువులో పూడికతీత పనులను చేపట్టేందుకు ప్రస్తుతం చెరువులో ఉన్న నీటిని మత్తడి ద్వారా ప్రతిరోజు విడుదల చేయనున్నట్లు తెలిపారు. భద్రకాళి చెరువు నీరు నగరంలోని కాల్వ ద్వారా హస న్ పర్తి మండలం నాగారంలోని పెద్ద చెరువుకు చేరుతుందన్నారు. ఒకవేళ నాగారం చెరువు భద్రకాళి చెరువు నుండి వచ్చే నీటితో నిండినట్లయితే ఇప్పటివరకు ఏ విధంగానైతే మత్తడి నుండి కింది ప్రాంతానికి వాగు ద్వారా ఏ విధంగా అయితే వెళ్తుందో అలాగే వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు, రైతులకు, పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నీటి ప్రవాహం సాఫీగా ఉండేటట్టు సాగునీటిపారుదల శాఖ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడతారన్నారు. కల్వర్టుల వద్ద, కాల్వలలో చెత్త చెదారం, ఇతర ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భద్రకాళి చెరువు నీటిని పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ పరిమాణంలో శుక్రవారం నుండి విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. కాలువల పక్కన ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 10-15 రోజుల్లో భద్రకాళి చెరువులోని నీటిని పూర్తిస్థాయిలో తీసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. భద్రకాళి చెరువులోని నీటిని తీసే ప్రక్రియను జాగ్రత్తగా చేయాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. భద్రకాళి చెరువులో పూడిక తీయడం వలన నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, చెరువు నీరు బాగుండనుందని పేర్కొన్నారు. భద్రకాళి చెరువు పూడికతీయడం వలన రానున్న రోజుల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. చెరువు నీటిని తీసేసిన అనంతరం పూడికతీత పనులు జరుగుతాయని అన్నారు. భారీ వరదల కారణంగా మురుగునీరు కొంతమేరకు వస్తుందని, మిగతా సమయాల్లో మురుగునీరు అందులో చేరదన్నారు. చెరువు పూడికతీత అనంతరం రానున్న రోజుల్లో బొంది వాగు ప్రాంతం నుండి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మురుగునీటి విషయంలో ఎస్ టి పి ప్లాన్ కోసం మంత్రులు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా సాగునీటి పారుదల శాఖ ఈఈ సీతారాం, మున్సిపల్ డిఈ సంతోష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: