హన్మకొండ ;

 ఎన్యుమరేషన్ బ్లాకుల ప్రకారం  జిల్లాలోని ప్రతి ఇంటిని  సర్వే చేయాలని  ఎన్యుమరేటర్లను ఆదేశించినట్లు  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.

బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో  ప్రారంభమైన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ ను  సర్వేకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా సమగ్ర వివరాలు తీసుకున్న అనంతరం  సంబంధిత ఇంటికి సర్వే పూర్తి చేసినట్లు  వేసిన స్టిక్కర్ను  కలెక్టర్ పరిశీలించారు. సర్వేకు సంబంధించి  ఎన్యూమరేటర్ కు కలెక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే కోసం ఎన్యుమరేటర్  ఇంటికి వచ్చినప్పుడు సమగ్ర వివరాలను ప్రజలు తెలియజేయాలని, ఆధార్ కార్డ్,పాస్ బుక్, రేషన్ కార్డులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వీటిని అందుబాటులో ఉంచినప్పుడు ఎన్యుమరేటర్లకు సర్వేలో వివరాలు తెలియజేయవచ్చన్నారు. జిల్లాలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సర్వేను చేపట్టేందుకు ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను  నియమించినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్యుమరేషన్ బ్లాక్ ల ప్రకారం  సర్వే సాగుతుందన్నారు. ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్ కు  ఒక ఎన్యుమరేటర్ ను నియమించినట్లు  చెప్పారు. 10 ఎన్యూమరేషన్ బ్లాక్ లకు  ఒక సూపర్వైజర్ ను  కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో 1917 ఎన్నిమరేషన్ బ్లాక్ లు ఉన్నాయని, సూపర్వైజర్లు 260మందిని నియమించినట్లు తెలిపారు. రిజర్వు సిబ్బందిని కూడా  అందుబాటులో ఉండే విధంగా  సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు  సర్వే చేసేందుకు ఎన్యుమరేటర్లుగా  ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. ఎన్యుమారేటర్లకు  సర్వే కి సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లా, మండల స్థాయిలో  శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినట్లు  తెలిపారు . సర్వేను  రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటగా గుర్తించబడిన ఇళ్ల ప్రకారం  ఎన్యూమరేషన్ బ్లాక్ ప్రకారం  ప్రతి ఇంటికి సర్వే అనంతరం స్టిక్కర్ ను వేస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ బ్లాక్ లో  ప్రతి ఇంటిని సర్వే చేస్తారని పేర్కొన్నారు. సర్వేకు ప్రతి కుటుంబం సహకరించాలని, సమగ్ర వివరాలను అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. ఎక్కడైనా సర్వే మిస్ అయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్  జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: