హన్మకొండ ;
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఎన్యుమరేటర్లను ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని చైతన్యపురి కాలనీ, హసన్ పర్తి మండలం జయగిరి గ్రామంలో కొనసాగుతున్న సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే కొనసాగుతున్న విధానాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురించిన వివరాలను అధికారులతో పాటు ఎన్యుమరేటర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వే ఏ విధంగా చేపడుతున్నారని అధికారులను ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. సర్వే అనంతరం ఇంటికి అతికిస్తున్న స్టిక్కర్ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి ఇంటిని సర్వే చేయాలని అధికారులను ఎన్యుమారేటర్లను ఆదేశించారు. ఎన్యుమరేషన్ బ్లాక్ ప్రకారం సర్వే నిర్వహించాలన్నారు. మాస్టర్ మ్యాపు ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి ఇంటికి సంబంధించిన అన్ని వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ బ్లాక్ లలో ఎన్నెన్ని ఇండ్లు ఉన్నాయో సరిగా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వేలో అన్ని వివరాలను కూడా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసిల్దార్ బావ్ సింగ్, హసన్ పర్తి తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్, ఇతర అధికారులతో పాటు ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
Post A Comment: