ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు కోసం చేపట్టిన సర్వేను సమగ్ర వివరాలతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో పైలట్ ప్రాజెక్టుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆ ప్రాంతంలో సాగుతున్న సర్వే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన ప్రాంతాల్లో సర్వే ను ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేకు సంబంధించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా యూపిహెచ్ సి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. స్థలానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, మున్సిపల్ కమిషనర్ నరసింహ,ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: