ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో కొత్తగా చేరిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి,బదిలీ పైన వెళ్ళిన అధ్యాపకులకు వీడ్కోలు సమావేశం శుక్రవారం ఘనంగానిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ శరదృతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యాపకులు బదిలీ పై వెళ్ళిన వారికి,కొత్తగా వచ్చిన సందర్భంగా శాలువాలతో పూలగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.గత ఎనిమిది ఏళ్ళు గా కలిసి ఉన్న అనుబంధం గురించి ఆత్మీయంగా చెప్పుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఆటపాటలలో విద్యార్థినులు ఉత్సాహంగా ఫ్రెషర్స్ వేడుకలు జరుపుకున్నారు. కళాశాల లో వందకు తొంబై తొమ్మిది మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. హిందీ అధ్యాపకులు అయ్యూబ్ టాపర్స్ గా నిలిచిన పేద విద్యార్దులకు పరీక్ష ఫీజు గా రూ.10,500 ప్రిన్సిపాల్ శరదృతికి అందించారు. సివిక్స్ అధ్యాపకురాలు శోభ,ఇంగ్లీషు అధ్యాపకురాలు లతలు టాపర్స్ విద్యార్థులకు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బదిలీ పై వెళ్ళి న అధ్యాపకులు వరప్రసాద్, శోభ, లత,ఆఫీస్ సబార్డినేట్ నయీమున్నీసా,
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శరదృతి తో పాటు స్టాఫ్ సెక్రెటరీ శ్రీనివాసశర్మ,జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల,ప్రవళిక,టూరిజం కోఆర్డినేటర్ మంజుల, అధ్యాపకులు హరికృష్ణ, డాక్టర్ కె.కరుణశ్రీ, హేమలత,కవిత,
షబానా, విజయ లక్ష్మి,కల్పన,మనోహర్,
శ్వేత,స్వప్న,నాన్ టీచింగ్ స్టాప్ రూప, అనీస్ ఫాతిమా, స్వర్ణ రాజు, రాము,నాగేశ్వరరావు విద్యార్థినులు పాల్గొన్నారు.
Post A Comment: