ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీసులు సత్వరంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబధిత ఎస్ఐ సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.
Post A Comment: