ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులతో భారీ వర్షాల వలన కలిగిన నష్టం అంచనాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులను భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ హనుమకొండ జిల్లాకు రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వర్షాల వల్ల కలిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు జరిగిన నష్టం వివరాలు, ఏ ఏ పనులకు ఎన్ని నిధులు అవసరమో తగిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని కోరారు. నష్టం జరిగిన ప్రాంతాలలో త్వరగా పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈవో వాసంతి, జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి వెంకట్ నారాయణ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ రాజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: