జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్ల వాగు సమీపంలో శుక్రవారం సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతదేహం సగానికి పైగా కాలిపోయి ఉండగా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చి ఉంటారా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Post A Comment: