ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాష్ట్రంలోని జిల్లాల లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను త్వరగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా వాటిని పరిష్కరించాలంటూ శుక్రవారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు.
సీ.సీ.ఎల్.ఏ మాట్లాడుతూ భూముల మార్కెట్ ధరలను సవరించడానికి మండలాల పరిధిలో ఆర్డిఓ చైర్మన్ గా తహసిల్దారులు, ఎంపీడీవోలు , సబ్ రిజిస్టార్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే పట్టణ ప్రాంతాలలో అదనపు కలెక్టర్లు చైర్మన్ , మున్సిపల్ కమిషనర్లు , తహసిల్దార్లు , జడ్పీ సీ.ఓలు సభ్యులు గా కమిటీల ఏర్పాటు చేయాలని అదేవిధంగా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా అనామలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని దీనిలో అదనపు కలెక్టర్లు , ఆర్డీవోలు , తహసిల్దారులు , రిజిస్టార్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ఈ కమిటీలను త్వరగా ఏర్పాటు చేసి భూముల మార్కెట్ ధరలను సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట్ రెడ్డి , డిఆర్ఓ వై.వి గణేష్ , ఆర్డీవోలు పరకాల , వరంగల్ వెస్ట్ నారాయణ , వెంకటేశ్వర్లు మరియు సంబంధిత తహసిల్దార్లు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: