ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మొదలైన పనులను పాఠశాలలు ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికలపేట , జీల్గుల లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను నాణ్యతగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సమీపిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులను తయారు చేస్తున్న ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మహిళా స్వశక్తి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఏకరూప దుస్తులను నిర్ణీత గడువులోగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ఎం.పీ.డీ.వో విజయ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: