ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పర్యావరణ పరిరక్షణకు స్వేచంద సంస్థలు , విద్యార్దులు, సామాన్యులు కృషి చెయ్యాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో నేల పునరుద్ధరించడం , ఏడారీకరణను నిరోధించడం, కరువు నీ తట్టుకోవడం అనే అంశం తో నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ మానవాళి అవసరాల కోసం చేపడుతున్న చర్యలు భూమి , నీరు, గాలి పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, ముఖ్యంగా ఒక సారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వలన భూమి లోనీ నీరు చేరకుండా అడ్డు తగులుతున్నాయి అని దీని వల్ల భూమి నిస్సారం అవుతుందని దీనినీ మనం కట్టడి చెయ్యాలని అని
అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్లాస్టిక్ ను వాడకుండా చర్యలు తీసుకున్నారని అలాగే హనుమకొండ కలెక్టరేట్ సముదాయం లో ప్లాస్టిక్ నీళ్ళ బాటిల్ లను మరియు ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలు తయారు చెయ్యాలని సూచించారు. గత పది సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనందరం జిల్లా లో గ్రీనరీ ని వృద్ధి చెయ్యడానికి కృషి చెయ్యాలని అన్నారు. సమావేశం పాల్గొన్న విద్యార్దులు మరియు ఇతరుల చే పతిజ్ఞ చేయించారు.
ఈ కార్య్రమంలో డి.ఎఫ్.ఓ లావణ్య , కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ సునీత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: