ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద జిల్లాకలెక్టర్ సిక్తా పట్నాయక్ నివాళులు అర్పించడం జరిగింది. ఉదయం 9.00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయము(IDOC) లో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ వెస్ట్ శాసనసభ సభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఘా, వరంగల్ మున్సిపల్ కమీషనర్ అశ్విని తానాజీ వాఖేడే, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్ )రాధిక గుప్త, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకట్ రెడ్డి, మరియు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: