ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పి కిరణ్ ఖరే జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలు, పోలిసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2014, జూన్ 2న, అధికారికంగా ఏర్పడిందన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు.
సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. పోలీసులు వృత్తి దైవంగా భావించి పనిచేయాలని సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని అన్నారు. అధికారులు మరియు సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతతో పని చేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవల ను అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ గారు కోరారు. అనంతరం ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ పథకాలను ఎస్పి కిరణ్ ఖరే పోలిసు సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. సంపత్ రావు, వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: