జనగాం: చనిపోయిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి తనతో రమ్మంటోందని ఓ వివాహిత బుధవారం సూసైడ్ చేసుకుంది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపురానికి చెందిన రాధిక కొన్ని రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాధిక నిన్న తన అన్నకు ఫోన్ చేసి చనిపోయిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి రమ్మంటోందని తెలిపింది. అవేమీ పట్టించుకోవద్దని రాధికకు తన అన్న దైర్యం చెప్పాడు. అనంతరం రాధిక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Post A Comment: