కరీంనగర్:
ఓ వ్యక్తి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గరలోని బాలాజీ నగర్ సుచిత్ర అపార్ట్మెంట్లో కామారపు రమేశ్ (56) నివసిస్తున్నారు. అదే అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి అతడు దూకగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: