తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అయితే వీరికి 2050 శాఖలు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోర్ట్ఫోలియోపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖ కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారన్నది హాట్గా పిక్ గా మారింది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ డైనమిక్గా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు. ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లే బీఆర్ఎస్ హైదరాబాద్లో క్లీన్స్వీప్ చేసిందన్న వాదనా ఉంది. ఇప్పుడు శాఖ తీసుకునే మంత్రిని యూత్ కేటీఆర్తో పోల్చడం ఖాయం. కొత్తగా ఐటీ శాఖ తీసుకునే మంత్రి కేటీఆర్ రేంజ్లో శాఖ నిర్వహించకపోతే యువత అసంతృప్తికి గురయ్యే చాన్స్ లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్త ప్రభుత్వంలో ఈ శాఖ కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఎక్కువ మంది సీనియర్లే. వీరిలో ఎవరికీ గతంలో ఐటీ శాఖ నిర్వహించిన అనుభవం లేదు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి లేదంటే శ్రీధరాబాబుకు ఐటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే నిజమైతే వీరిద్దరూ కేటీఆర్కు ధీటుగా ఐటీ
Post A Comment: