ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;సమాజ ప్రగతికి అడ్డంకిగా మారుతున్న మత్తు పదార్థాలను, వాటి వినియోగాన్ని అరికట్టెందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం రోజున హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పిల్లల మధ్య మత్తుపదార్థాలు మరియు దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన పై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సబ్ స్టాక్సెస్ అబ్యూస్ ఎమాంగ్ చిల్డ్రన్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్)పై మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సమన్వయంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా రెవెన్యూ అధికారి, నోడల్ అధికారి వై. వి. గణేష్ నేతృత్వంలో జిల్లా సంక్షేమ అధికారి మధురిమ సభాధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం అనేది సమాజానికి ముప్పు అని అన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి భావిజీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిసర ప్రాంతాలపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. విద్యార్థుల ప్రవర్తన పై ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
పాఠశాలలో ప్రహరీ క్లబ్బులు ఏర్పాటు చేసి బాలల రక్షణ, సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు, ప్రధానంగా పాఠశాలకు 100 మీటర్ల దూరంలో బెల్ట్ షాపులు లేకుండా, పిల్లలకు మత్తు పదార్థాల వినియోగంకు చోటు కల్పించే చిన్న చిన్న షాపులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని అన్నారు.
వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డ్రగ్స్, దానిని అరికట్టే చర్యలు, వాటికి సంబంధించిన వివిధ అంశాలను ఈ సందర్భంగా వివరించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
మత్తు పదార్థాలు, వాటి వాడకం వల్ల కలిగే అనర్ధాలు, వాటిని వినియోగించే వారి ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మత్తు పదార్థాల వాడకం వలన వచ్చే శారీరక, మానసిక స్థితిగతులపై సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్ పవర్ పాయింట్ ప్రజెంటేయషన్ ద్వారా ఉదహరించారు.
ఈ కార్యక్రమంలో డిపివో జగదీశ్వర్, డిడబ్ల్యూవో కె. మధురిమ, డిఎంహెచ్వో డాక్టర్ బి.సాంబశివరావు,
చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
ఎస్. ప్రవీణ్ కుమార్,
జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్,
జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్
జన్ను కిరణ్ కుమార్,
ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ వెంకట్రాం, టీ న్యాబ్
ఇన్స్పెక్టర్ సురేష్,
సిఎంవో రాధ, సిడబ్ల్యూసి సభ్యులు కే దామోదర్, ఎస్ రాజేంద్రప్రసాద్, పి హైమావతి,
గురుకులాల ఆర్సిలు శ్రీపాల, ఎం. మల్లయ్య, శ్రీనివాసరావు, సరిత, హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతినిధి రాము, సోషల్ వర్కర్ చైతన్య, సిహెచ్ ఎల్ కోఆర్డినేటర్ భాస్కర్, డ్రగ్గిస్ట్ కెమిస్ట్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: