ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;6 గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించాం.
రేపు రెండు గ్యారంటీల అమలు పై సీఎం
రివ్యూ చేస్తారు అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
9వ తేదీ నుండి ఆరు గ్యారంటీలో భాగంగా 2 గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించామన్నారు.
2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 7 వరకు ఖర్చుపెట్టిన నిధులు, ఇతరత్రా అభివృద్ది కార్యక్రమాల ఖర్చు, తదితరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించాం. అందుకు అవసరమైన అన్ని పత్రాలు సిద్దం చేయమని అధికారులకు ఆదేశాలు.
రాష్ట్ర ఆర్థిక స్థితి విషయాలపై ప్రజలకు తెలియపరచ తలచాము.
విద్యుత్ విషయంలో సమీక్ష చేయదలచాం.
మా గ్యారంటీల హమీ మేరకు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు ఫ్రీగా ఇవ్వటానికి సిద్దమయ్యాం.
ఎల్లుండి 9న ప్రోటెం స్పీకర్ ఎన్నిక నిర్వహించి, నూతన ఎంఎల్ఏల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నాం.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,
200 యూనిట్లలోపు గృహ విద్యుత్ ను ఉచితంగా అందించే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుడతాం.
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 6 గ్యారంటీలో రెండింటి అమలు చేస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Post A Comment: