ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత రెండు పర్యాయాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించింది. మూడు సంవత్సరాలు మేయర్ గా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఆశీర్వదించి ముందు తీసుకుపోయినందుకు వారికి ధన్యవాదాలు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో నా వంతు కృషి చేశాను. నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను వారిని కాపాడడంలో ముందుంటా.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తా.
బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు.
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దు, అదైర్యపడొద్దు పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఏ నియోజకవర్గం నిర్వహించని, ప్రతిపక్ష పాత్ర వరంగల్ తూర్పులో నిర్వహిస్తా పత్రికా సెల్ ఏర్పాటుకు కృషి చేస్తా. రాజకీయంలో గెలుపు ఓటములు సహజం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం
ప్రభుత్వంలో ఉన్న వారు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పనిచేస్తే అంతకు పదింతలు మేమేంటో చూపిస్తాం.పార్టీని క్యాడర్ను కాపాడుకోవడంలో ముందుంటా పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా వారి కష్ట సుఖాలలో అండగా ఉంటా వరంగల్ తూర్పు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Post A Comment: