ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం పరిశీలించారు. హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పాటు వివిప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్, మాక్ పోల్ సర్టిఫికెట్, పి వో డైరీ, టెండర్డ్ బ్యాలెట్ పేపర్, నామినేషన్స్ పేపర్స్, స్క్రూటీని పేపర్స్, పోల్డ్ వివిప్యాట్ స్లిప్స్, తదితర ఎన్నికల సామగ్రిని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చగా పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, రమేష్ లను కలెక్టర్ సీల్, భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం లతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనగా అధికారులు, సిబ్బంది తాళాలు వేసి సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతరం సీసీ కెమెరా ల నిఘా తో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రతీది భద్రంగా భద్రపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్లు విజయ్ కుమార్, బావ్ సింగ్, ఇతర అధికారులు ఉన్నారు.

Post A Comment: