ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) శ్రీమతి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు.
సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో పర్యావరణం, అడవుల రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులు, పండితులు మంత్రి దంపతులను
కలిసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: