ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల జనరల్ ఒబ్సెర్వెవ్ dr. Hn గోపాలకృష్ణ, పోలీస్ అబ్సర్వేర్ తొగో కర్గా ఎక్సపెండ్ అబ్సవర్ రాహుల్ పంజాబ్రావ్ గవండే లు గురువారం
ఐడిఓసి లో గల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్, వీడియో సర్వే లైన్స్ సిస్టం ల కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల పరిశీలకులు రికార్డు లను పరిశీలించారు. వచ్చిన పిర్యాదు లను సత్వరమే పరిష్కారించాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా జనరల్ ఎన్నికల పరిశీలకులు మాటలుడుతూ
C విజిల్ యాప్‌ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్‌తో అనుసంధానం చేశారని అన్నారు. అక్రమాలకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలోనే దర్యాప్తు చేసి ఫిర్యాదుదారుడికి తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్కాడ్‌కు సత్వరమే చేరుతుందని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు, నాయకుల అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై సామాన్య పౌరులు సైతం నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, అన్నారు.ఈ యాప్‌లో ఎన్నికల సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న కోడ్ ఉల్లంఘనలు పొందుపరుచవచ్చునని , ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో సీపీ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ సిక్త పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: