ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా లో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయము తో పని చేయాలి అని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్. ఎన్.గోపాలకృష్ణ సూచించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో ఈనెల 30వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికలపై ఎన్నికల నోడల్ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని గురువారం జనరల్ ఒబ్సెర్వెవ్
డాక్టర్ హెచ్ ఎన్ గోపాలకృష్ణ, పోలీస్ అబ్సర్వేర్ తొగో కర్గా ఎక్సపెండ్ అబ్సవర్ రాహుల్ పంజాబ్రావ్ గవండే లు
నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణ గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా జనరల్ అబ్సర్వర్ మాట్లాడుతూ
జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పోలింగ్ జరిగే 30వ తేదీన ఏ చిన్న పొరపాటు జరగకుండా పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈనెల 29 30 తేదీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా స్వీప్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్తు, తదితర మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఎన్నికల వేల పోలింగ్ కేంద్రాలకు వచ్చే సీనియర్ సిటిజన్స్, నూతనంగా ఓటు వేసే యువ ఓటర్లకు స్వాగతం పలకాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఎన్నికల సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సరైన ఏర్పాట్లు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు.
పోలీసు పరిశీలకులు తోగో కర్గా,వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావ్ గవండే మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని పనిచేయాలని, ఎన్నికలు ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటుహక్కును ఉపయోగించుకొనే విధంగా వారికి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. నిబంధనల మేరకు అభ్యర్థుల ప్రతి పైసా లెక్కించాలని అన్నారు. ఎలక్షన్‌కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్, సీసీ కెమెరాలు, సీసీ కెమెరా ఫుటేజ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలని, అధికారులందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్‌లను ఎల్లపుడు సందర్శిస్తూ, స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండాలని తెలిపారు. అధికారులు ఇన్‌ఫర్మేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండాలి అని అన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, ఆ చోట్ల పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు గుర్తించిన సమస్యత్మక ప్రాంతాల్లో రూట్ మార్చ్ ను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అంతా కలిసి కృషి చేద్దామని అధికారులకు తెలియజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం
జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వస్తువుల కల్పన పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రాలు త్రాగునీరు విద్యుత్తు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, డ్రికింగ్ వాటర్, వాష్ రూమ్స్, టాయిలెట్స్, వీల్ ఛైర్స్, ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించిన సీ విజిల్ యాప్ కు ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరాలు, ఎన్నికల ర్యాండమైజేషన్, సెక్టోరియల్ అధికారులు, ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో నమోదైన ఎన్నికలకు సంబంధించిన కేసులు, ఎన్నికలకు సంబంధించి చేపట్టబోయే అంశాలు, ఎన్నికల వ్యయం, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత తదితర అంశాలను వారికీ వివరించారు.
ఈ సమావేశం లో
ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ భారీ, డిఆర్వో వై వి గణేష్, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: