ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ
బీసీ సీఎం చేస్తామన్న బీజేపీ ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీ వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెత్తందార్ల మనస్తత్వంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు.. ఆ పార్టీలను తెలంగాణ బీసీలు ఓటుతో తిప్పికొట్టాలన్నారు.బీసీ సీఎం అయ్యేందుకు బీసీలంతా ఏకం కావాలి, తమ సత్తా చాటాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3కే పరిమితమైంది. తరతరాలుగా బీసీలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్’’ అంటూ లక్ష్మణ్ ధ్వజమెత్తారు.…

Post A Comment: