ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గాన దిక్కులన్నీ పెక్కటిల్లేలా,కాలనీలన్ని గులాబీ జెండా నీడన అడుగులోఅడుగేస్తూ గులాబీ దండు కదిలింది. 

శివనగర్ లోని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నివాసం నుండి ప్రారంభమైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ నామినేషన్ ర్యాలీ శాసనమండలి డిప్యూటీ చేర్మెన్,బిఆర్ఎస్ వరంగల్ తూర్పు ఇంచార్జ్ బండా ప్రకాష్ తో కలిసి పోస్టాపిసు, చౌరస్తా, జేపిన్ రోడ్,మండిబజార్, పోచంమైదాన్,గోపాలస్వామి గుడి,ఎంజిఎం సర్కిల్ మీదుగా అశేష జనవాహిని అభిమాన నాయకుడు కోసం ఆకాశమంత ప్రేమ చూపిస్తూ గులాబీ దండు కదన రంగంలో ముందుకు సాగింది

ఇది నామినేషన్ ర్యాలీనా లేక విజయోత్సవ సభ అనే తీరుగా ఎమ్మెల్యే నరేందర్ నామినేషన్ ర్యాలీ కొనసాగింది.

డబ్బు చప్పుళ్ళు, మహిళల కోలాటాలు,కళాకారుల ఆట పాటతో కార్యకర్తల కేరింతల నడుమ ఓరుగల్లు పురవీధులు జయహో నరేందర్ నినాదాలతో దద్దరిల్లింది.

ఎంజిఎం సెంటర్ భారీ గజమాలతో శాసనమండలి డిప్యూటీ చేర్మెన్,ఎమ్మెల్యే నరేందర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ గజమాలతో అభిమానులు సత్కరించారు.

ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చేరెన్స్ బండా ప్రకాష్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్,చేర్మెన్ బొల్లం సంపత్ యాదవ్,కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్,బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్,పోశాల పద్మ స్వామి గౌడ్ తో కలసి ఎమ్మెల్యే నామినేషన్ సమర్పించారు

నామినేషన్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వన వరంగల్ తూర్పు ప్రజల ఆశీర్వాదంతో గత ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసాను నేను చేసిన అభివృద్ధి మీ కళ్ళముందు ఉంది తూర్పు ప్రజలే నా కుటుంబ సభ్యులుగా నేను లోకల్ అండర్ బ్రిడ్జి దగ్గరే నా ఇల్లుంది అందరికి అందుబాటులో ఉన్న నన్ను గెలిపించండి అండగా ఉంటా 

ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఎ ఈ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్తా మరోమారు ఓరుగల్లు తూర్పు ప్రజల దివేనలతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆదరించండి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వరంగల్ తూర్పు యావత్తు నరేందర్ బలగం ఎమ్మెల్యే నరేందర్ గెలుపుకై కదిలాయి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: