ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు పారదర్శకంగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సీపీ అంబర్ కిషోర్ ఝా తో కలసి అకౌంటింగ్ టీం, ఎస్.ఎస్.టి., వి.ఎస్.టి., వీవీటీ టీమ్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సందేహాలను వారు నివృత్తి చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు, ఎంసిఎంసి, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీం, వీడియో సర్వేలెన్స్ టీం, వీడియో పరిశీలన టీం, అకౌంటింగ్ టీంలు ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆమోదం, ఆమోద యోగ్యం కాని ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీం, వీఎస్టీ, వీవీటీలు నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ద్వారా నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌షోలో అన్నింటినీ వీడియో సర్వేలెన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి, వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియో పరిశీలించి వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులకు అందజేయాలని, అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని అన్నారు. అనంతరం పూర్తి వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. ర్యాలీలు, సమావేశాల ద్వారా నిర్వహించిన పార్టీ, ప్రచార ఖర్చులు నిర్ణయించిన రేట్ల ప్రకారం నమోదు చేయాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచార వ్యయ ఖర్చుల అకౌంట్లు, రిజిస్టర్లు నిర్వహించాలని అన్నారు. వివిధ వర్గాల ద్వారా వచ్చే పిర్యాదులను ఎటువంటి పెండింగ్ ఉంచకుండ సత్వరమే పరిష్కరించాలని అన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను తిరిగి అప్పగించాలంటే తగిన ఆధారాలు చూపించాలని, గ్రీవెన్స్ కమిటీ త్వరితగతిన కేసుల పరిష్కారం చేస్తుంది అని అన్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలలో పోలీసు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విస్తృత తనిఖీలు నిర్వహించి రూ. 14 కేసులు నమోదు కాగా నేటి వరకు 37 లక్షల 87 వేల 201నగదును సీజ్ చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.తనిఖిలలో జప్తుచేసిన నగదు, మద్యం, ఇతర వస్తువులకు తగిన ఆధారాలు చూపించిన 10 కేసులు కు గాను 33,96,501 లు జిల్లా గ్రీవెన్స్ రిడ్రైసల్ కమిటి విడుదల చేశామని. మిగతా కేసులకు తగిన ధృవీకరణ పత్రాలు చూయించిన వెంటనే విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
సీపీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు విలువైన సేవలు అందించేలా విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలోఎన్నికల నిర్వహణ కు అధికారులు అందరు సమన్వయము తో పని చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, పి.డి డి.అర్.డి.ఏ శ్రీనివాస్ కుమార్, ఐటీ ఆఫీసర్.చక్రధర్, డి.సి.ఓ జి.నాగేశ్వర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: