ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ జిల్లా మున్నూరు కాపు భవనంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సంఘంతోని ఈ స్థలంతోనే ఈ నిర్మాణం తోని అవినాభవ సంబంధం ఉన్నదని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.40 ఏళ్ల నుంచి ఈ స్థలంతో, కుల సంఘ నాయకులతో సంబంధం ఉందని అన్నారు. మీ అందరి సహకారంతోని,మీ అందరి దీవెనలతోని, శాసనసభ్యుడిగా ఎంపికయ్యానని అన్నారు. వచ్చినటువంటి స్ఫూర్తి తోని,సంఘాన్ని ముందుకు తీసుకోవాలని అన్నారు. అంబేద్కర్ అన్నట్లు ప్లే బ్యాక్ టు సొసైటీ అన్నట్లుగా సంగం బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.కొంతమంది ముఖ్యులు భవనం కోసం నా దగ్గరకు వస్తే నా యొక్క పూర్తి సహకారాలు అందిస్తానని తెలిపి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రూ.5.5 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ స్థలంలో రోడ్డు పోతుంది అన్నప్పుడు కూడా మాట్లాడి మాట్లాడు ప్లాన్ నుండి తొలగించడం జరిగిందన్నారు.కుల సంఘ భవనం నకు సహకరించడం జరిగిందన్నారు. అన్ని విభాగాల అధికారులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. కుల సంఘం నుండి డబ్బులు ఖర్చు చేయకూడదని నా సొంతగా ఇస్తానని తెలిపి ఇవ్వడం జరిగిందన్నారు.భవన నిర్మాణ అనుమతి కోసం అందరితో మాట్లాడి నిధులను తీసుకురావడం జరిగింది అన్నారు. ఈ నెల ఆరో తారీఖున మంత్రి కేటీఆర్ వస్తున్నారని, అతనితోనే భవనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని కొబ్బరి కాయ కొట్టి ప్రారంభిస్తారని తెలిపారు.సంఘంలో ఉన్నటువంటి వాళ్లకే ఈ కాంట్రాక్టు ఇస్తానని తెలిపారు.ఈ భవన నిర్మాణం అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మించాలని సంఘ సభ్యులకు తెలిపారు.
Post A Comment: