ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మైనారిటీ బందు పథకాన్ని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి పార్టీలు మైనారిటీలను ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారని అన్నారు. భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరులను రాజకీయంగా,ఆర్థికంగా అభివృద్ధిపరిచే విధంగా అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యారంగంలో ఒక్కొక్క విద్యార్థి పైన రూ.1,20,000 వెచ్చించి నాణ్యమైన భోజనంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. మైనార్టీ విద్యార్థులు సైతం ఇంగ్లీషులో, హిందీలో ఉర్దూలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో నేను పనిచేయడం గొప్ప వరంగా భావిస్తున్నానని అన్నారు. వైద్యరంగంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య రంగాన్ని కూడా బలోపేతం చేస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సబ్ బండ వర్గాల సంక్షేమ కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. మిగతా పార్టీలు మత విద్వేషాలు,మతకల్లోలాలు చేస్తూ మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు. అలాంటి పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని తెలిపారు. మైనారిటీ కుటుంబాలతోని ఎన్నో ఏండ్లుగా సంబంధం ఉందని, అలా నా ప్రతి విజయంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కరుణ కాలంలో కూడా అనేక సహకారాలు అందించాలని తెలిపారు. ఎలక్షన్ సందర్భంగా అందరూ ఓట్ల కోసం వస్తారని మీకు పని చేసేటువంటి నాయకుడు మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని అన్నారు. ఏ సమయంలో మీరు నా తలుపు తట్టిన మీకు నా వంతు సహాయ సహకారాలు అందించాలని, అలాంటి మీ కుటుంబంలో ఒకడిగా నన్ను ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతేయాజ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆజీజ్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు ముస్లిం మత నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: