ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రూ. 100 కోట్ల నిధులతో హనుమకొండ బస్టాండ్ ను అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. జిల్లా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సాయంత్రం హనుమకొండ బస్ స్టాండ్ ను పరిశీలించారు. ఈనెల 6న కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 35 ప్లాట్ ఫార్మ్స్, జి ప్లస్ రెండు అంతస్తులు అత్యాధునిక వసతులతో బస్టాండ్ నిర్మించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర రాజు యాదవ్ మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, కమిషనర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
.
Post A Comment: